![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -155 లో.... మాధవ వాళ్ళు అందరు పార్క్ కి వస్తారు. అక్కడ మహా బ్యాగ్ లో నారాయణ మందు బాటిల్ పెడుతాడు. అది తెలిసి మహా అతనిపై కోప్పడుతుంది. నేను అలిగానని నారాయణ అంటాడు. దాంతో అందరు వెళ్లి తనకి చెక్కిలి గింతలు పెట్టి నవ్విస్తారు. ఆ తర్వాత ఐస్ క్రీమ్ తీసుకొని వస్తానని మహా వెళ్తుంది. తన వెనకాలే చక్రి వెళ్తాడు. మహా ఫొటోస్ తీస్తుంటే ఇదే కరెక్ట్ టైమ్.. నా మనసులో మాట చెప్పడానికి అని చక్రి అనుకొని పక్కకి తిరిగి తన మనసులో మాట చెప్తాడు.
చక్రి మాటలు మహా వినదు. వేరే ఒకావిడ వింటుంది. తన భర్త కూడా పక్కనే ఉంటాడు. ఏంట్రా నా భార్యని ప్రేమిస్తున్నావని అతను గొడవపడతాడు. అదేం లేదు నేను నా భార్యని ప్రేమిస్తున్నాను అదిగో తను అక్కడే ఉందని మహాని చక్రి చూపిస్తాడు. మరొకవైపు మనీషా, మాధవ పార్క్ లో తిరుగుతుంటే మాధవకి తెలిసిన అతను కలుస్తాడు. మాధవకి పెళ్లి అయింది అనుకుంటాడు. కాలేదని మాధవ క్లారిటీ ఇస్తాడు. మరొకవైపు కన్నా, నారాయణ తిరుగుతుంటారు. నేను ఆ అమ్మాయిని ఎలా పడేస్తానో చూడమని నారాయణతో కన్నా అంటాడు. ఆ అమ్మాయికి కన్నా సైట్ వేస్తుంటే ఆ అమ్మాయి వచ్చి అన్నయ్య అంటుంది. దాంతో నారాయణ నవ్వుకుంటాడు. మరొకవైపు కేశవ, శైలు ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చి పార్క్ పొదల్లో కూర్చొని ఉంటారు. కేశవ మాటలు కన్నా విని అందరికి చెప్తాడు. అందరు వచ్చి వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారోనని దాక్కొని వింటారు. కేశవ ఇంట్లో ఒక్కొక్కరి గురించి చెప్తాడు.
కన్నా డిగ్రీ ఫెయిల్ చక్రి బేవార్స్ మాధవ అన్న అతిమంచివాడు నారాయణ వెస్ట్ ఫెల్లో మహా గయ్యాళి అంటూ చెప్తాడు అది అందరు విని ఎలాగైనా కేశవ పని చెప్పాలనుకుంటారు. కన్నా పల్లీలు అమ్మే అతనిలాగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కన్నాని చూసి కేశవ షాక్ అవుతాడు. తరువాయి భాగంలో చక్రి తన మనసులో మాట మహాకి చెప్తాడు. మిమ్మల్ని నా భార్య అనుకుంటున్నానని చక్రి చెప్పగానే మహా అది విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |